మంచు హీరోతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ?

“జాతి రత్నాలు” హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిట్టి అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ హైదరాబాదీ బ్యూటీ. అయితే ఈ భామకు మాత్రం ‘జాతి రత్నాలు’ తరువాత ఇప్పటి వరకు మరో అవకాశం తలుపు తట్టలేదు. కానీ తాజాగా మంచు హీరో సరసన నటించే అవకాశం లభించినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఢీ’ సీక్వెల్ కోసం ఫరియా అబ్దుల్లాను సంప్రదించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకు ఫరియా అబ్దుల్లా మంచి జోడి అవుతుందని మేకర్స్ భావించారట. ఈ వార్తలు నిజమైతే గనుక మంచు విష్ణుతో ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేసే అవకాశం దక్కినట్లే. అతి త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమా గనుక హిట్ అయితే ఇక ఫరియా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. వరుస అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-