‘జాతిరత్నాలు’ బ్యూటీ ఐటెం సాంగ్ కు రెడీ

‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ ఐటెం పాటకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ కింగ్ నాగార్జునతో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనుందని సమాచారం.

Read also : ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీ రివీల్ చేసేసిన నాని

నాగార్జున నెక్స్ట్ మూవీ “బంగార్రాజు”లో ఫరియా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. వచ్చే నెలలో పాటను చిత్రీకరించనున్నారు మేకర్స్.’బంగార్రాజు’ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ ‘బంగార్రాజు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘బంగార్రాజు’ను జనవరి 2022లో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘోస్ట్’ షూటింగ్ కూడా చేస్తున్నారు. అది 2022లో విడుదల కానుంది.

Related Articles

Latest Articles