ఫ్యాన్స్ ను సమస్యల్లోకి నెట్టిన సుదీప్ బర్త్ డే… 25 మంది అరెస్ట్

సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం, అందులోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. కానీ ఆ అభిమానం చేయించే పిచ్చి పనులే ఆందోళనకరం. తమ అభిమానాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఏమైనా చేస్తారు. తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ అభిమానుల పిచ్చి వారిని సమస్యల్లోకి నెట్టింది. కొన్నిసార్లు వారి చర్యలు తమ అభిమాన తారలకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు.

సెప్టెంబర్ 2న కిచ్చ సుదీప్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సుదీప్ పుట్టినరోజు వేడుకల కోసం అభిమానులు ఒక గేదె దూడను బలి ఇచ్చారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటు చేసుకున్న ఈ కార్యక్రమంలో 25 మంది వ్యక్తులు పాల్గొన్నారు. అయితే అభిమానం చాటుకోవడానికి ఒక మూగజీవాన్ని బాలి ఇచ్చినందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : సిద్ధార్థ్ శుక్లా మరణానికి జాన్ సెనా సంతాపం

కన్నడ చిత్రాలలో నటించే సుదీప్, తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో కూడా కనిపించాడు. ఆయనకు సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. “దబాంగ్ 3″లో బాలి సింగ్‌ అనే విలన్ పాత్రలో కన్పించి నార్త్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న ఈ స్టార్ హీరో పుట్టినరోజున నగరం అంతటా తన పోస్టర్లను అతికించి, భారీ కట్ అవుట్‌లను పెట్టి పూజించారు. అయితే ఆ 25 మంది చేసిన పని మాత్రం షాకింగ్ సంఘటనగా మారింది. బళ్లారి నగర్ పోలీసులు ఈ 25 మందిని అరెస్ట్ చేశారు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జంతు ప్రేమికులు మంది పడుతున్నారు.

ఇదిలా ఉంటే నటుడు కిచ్చా సుదీప్ ప్రస్తుతం పాపులర్ రియాలిటీ షో కన్నడ “బిగ్ బాస్ 8″ని హోస్ట్ చేస్తున్నారు. దర్శకుడు అనుప్ భండారి దర్శకత్వంలో “విక్రాంత్ రోనా” అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-