సమంత, చైతూలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య నాలుగేండ్లలోనే విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా షాక్ కు గురైయ్యారు. ఇక వీరి విడాకుల విషయమై ఎవరికి తోచిన విధానంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైన వీరిద్దరూ.. తిరిగి రీల్ లైఫ్ లో మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. విడిపోయాక కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని వారే చెపుతున్నారని.. తిరిగి వారిద్దరూ కలిసి నటిస్తే తప్పేంటాని అభిమానులు కోరుకుంటున్నారు.

సమంత, నాగచైతన్యల నుంచి వచ్చిన సినిమాలు కూడా హిట్ సినిమాలు కావటంతో ఫ్యాన్స్ ఈ జోడి మరోసారి చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిద్దరూ.. ‘ఏం మాయ చేసావె చిత్రం తర్వాత ఆటోనగర్‌ సూర్య, మనం, మజిలి చిత్రాల్లో నటించారు. ఇందులో ఆటోనగర్‌ సూర్య పరాజయం చెందగా, మిగిలిన అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అలాగే ఓ బేబీ లోనూ చైతూ గెస్ట్ రోల్‌ చేశారు. మరి భవిష్యత్ లో వీరిద్దరి నుంచి సినిమా వస్తుందో, లేదో చూడాలి.

-Advertisement-సమంత, చైతూలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి..!

Related Articles

Latest Articles