బిగ్ బాస్ కు ఆ ‘ఊపు’ లేదేంటి? కారణాలేంటి?

బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో ప్రసారం అవుతున్న రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో దూసుకెళుతోంది. గతేడాది కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు షోను నిర్వహించాల్సి వచ్చింది. బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా నిర్వహించగా మధ్యలో ఒకసారి సమంత, రమకృష్ణ వంటి స్టార్లు సందడి చేసి ఆకట్టుకున్నారు.

గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్-4 సీజన్ చప్పగా మొదలైంది. అయితే క్రమంగా అదిరిపోయే ప్లానింగ్, టాస్కులు నిర్వహించడంతో బిగ్ బాస్-4 సీజన్ గాడిన పడిన సంగతి తెల్సిందే. అయితే అనుకున్న స్థాయిలో బిగ్ బాస్-4 అంచనాలను అందుకోలేదనే టాక్ మాత్రం తెచ్చుకుంది. దీంతో వీటన్నింటినీకి చెక్ పెట్టేలా బిగ్ బాస్ నిర్వాహకులు తాజా సీజన్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది బిగ్ బాస్-4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. రన్నర్ గా అఖిల్, సెకండ్ రన్నర్ గా సోహైల్ ఆ తర్వాత ప్లేసులో అరియానా నిలిచారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొంత తగ్గముఖం పట్టినప్పటికీ చాలా జాగ్రత్తల మధ్య బిగ్ బాస్-5 సీజన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-5 సీజన్ ప్రారంభంపై అప్ డేట్ వచ్చింది.

సెప్టెంబర్ 5న బిగ్ బాస్-5 సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బుల్లితెర ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. గతంలో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందంటే నెలరోజుల ముందు నుంచే మీడియాలో హైప్ క్రియేట్ అయింది. ఎవరెవరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు వెళుతున్నారు? ఎలాంటి టాస్కులు నిర్వహించబోతున్నారనే చర్చ నడిచేది. అయితే బిగ్ బాస్-5 విషయంలో మాత్రం పెద్దగా అప్ డేట్స్ ఏమీ ఉండకపోవడం ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. కనీసం పార్టిసిప్టెంట్ల విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, నటి సురేఖా వాణి విషయంలో కొంత ప్రచారం జరిగింది. అంతేగానీ మిగతా కంటెస్టెంట్లపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఎవరికీ వారు ఊహగానాలు చేస్తున్నారు.

మరో మూడు రోజుల్లో బిగ్ బాస్-5 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనూ కంటెస్టెంట్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ చప్పగా సాగుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక గత సీజన్లో హోస్టుగా అలరించిన నాగార్జునే ఈసారి కూడా హోస్టుగా రానుండటం ఈ సీజన్ కు ప్లస్ కానుందనే టాక్ విన్పిస్తుంది.

బిగ్ బాస్-4 మధ్యలో నాగార్జున కొంత బ్రేక్ తీసుకొని తన సినిమాలకు వెళ్లి మళ్లీ జాయిన్ అయ్యారు. దసరా రోజున బిగ్ బాస్ కు హోస్టుగా వచ్చిన నాగార్జున కోడలు సమంత ఆ ఎపిసోడ్ ను బాగా రక్తికట్టించింది. ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుందా? లేదో చూడాలి. కాగా గతంలో ముందుగానే షోలోని కొన్ని సన్నివేశాలను లీక్ చేసి నిర్వాహకులు అభిమానుల అటెన్షన్ వారివైపు డైవర్ట్ చేశారు. అయితే ఈసారి మాత్రం బిగ్ బాగ్ నుంచి పెద్దగా అప్డేడ్స్ లేకపోవడంతో ఆ ఊపుడేది బిగ్ బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-