కెప్టెన్సీనే కాదు.. ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకోవాలి.. కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా అతడి సారథ్యంలో ఇండియన్ టీం ప్రతిష్టాత్మమైన లీగ్ మ్యాచుల్లో తలపడుతోంది. ఈ నేపథ్యంలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా విన్పిస్తోంది. అతడిని టెస్టు క్రికెట్ టీంకు కెప్టెన్ గా పరిమితంచేసి పరిమిత ఓవర్ల టీంకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. బీసీసీఐ సైతం టీంఇండియాకు ఇద్దరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. త్వరలోనే ఇది అమల్లోకి రానుందని సమాచారం.

ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదిక తిరిగి ప్రారంభమైంది. నిన్న ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ జట్టు కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీతో సహా మిగితా ఆటగాళ్లు అందరూ కనీస పరుగులు చేయలేక చతికిలపడ్డారు. స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన కోల్‌కతా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవం ఉంచుకుంది.

ఈ మ్యాచ్ లో కోహ్లీ సేన ఫేవరేట్ గా బరిలో దిగగా అత్యంత దారుణంగా ప్రదర్శన చూపింది. ఫలితంగా కోహ్లీ ఐపీఎల్ లో ఆడుతున్న తన 200వ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓపెనర్ వచ్చి కేవలం ఐదు పరుగులకే వెనుదిరగడాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. కోహ్లీని ఓపెనర్ గా పంపడం పిచ్చి నిర్ణయమని, అతడిని ఎప్పటిలాగే మూడో ప్లేసులోనే పంపించాలని పలువురు సూచిస్తున్నారు. ఆర్సీబీలో అత్యధిక పరుగులు సాధించింది దేవదత్ పడిక్కల్(22). టీం మొత్తం దారుణంగా విఫలం చెందటంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోహ్లీ సేనపై దుమ్మెత్తి పోస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టుకు భారంగా మారుతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడిని ఓపెనర్ గా పంపించొద్దని సూచిస్తున్నారు. తను రెగ్యూలర్ వచ్చే మూడో ప్లేసులోనే పంపించాలని సూచిస్తున్నారు. ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో ఆర్సీబీ ఓటమిని లింకు చేస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. కోహ్లీ నువ్వు కెప్టెన్సీ నుంచే కాదు.. ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కోహ్లీ క్రికెట్ కెరీయర్ ముగిసిందని, అతడు అనుష్కశర్మతో కలిసి హాయిగా సినిమాలు చేసుకోవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ రేంజులో ఫైర్ అవుతున్నారు.

ఆర్సీబీ కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే ఏబీ డివిలియర్స్ కూడా ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. రస్సెల్ బౌలింగ్‌లో డివిలియర్స్ గోల్డెన్ డక్ అవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఏబీడి గోల్డెన్ డక్ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఏబీడీకి ఏమైందంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇక భారత్ వేదికగా దుమ్మురేపిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ యూఏఈ వేదికగా మాత్రం విఫలం అవుతూనే ఉన్నాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మొత్తానికి కోహ్లీ సేన వైఫల్యంపై ఫ్యాన్స్ మీమ్స్ చేస్తూ తమ కోపాన్ని కొంతమేర తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

-Advertisement-కెప్టెన్సీనే కాదు.. ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకోవాలి.. కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

Related Articles

Latest Articles