కుటుంబ, అవినీతి పార్టీకి కాలం చెల్లింది: తరుణ్‌ చుగ్‌

కేసీఆర్ రేపు ఎన్నికలకు వెళ్లినా ఆయనకు అభ్యర్థులు దొరకరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. కుటుంబం, అవినీతి పార్టీకి కాలం చెల్లిందన్నారు. మాకు అభ్యర్థులు ఉన్నారు. 70కి పైగా సీట్లను గెలుచుకుంటామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… బీజేపీ మీద విశ్వాసం పెరిగింది… మా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. మేం ధాన్యం కొనమని ఎక్కడ చెప్పలేదు. ప్రతి గింజ కొంటాం. పేదలకు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ స్కీంలను అందనీయడం లేదని పేర్కొన్నారు.

తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ కి పోయి కేసీఆర్ ఏమి చేసిండు అని ప్రశ్నించిన తరుణ్ చుగ్… కేసీఆర్‌ ఒక అబద్ధాల కోరు.. ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాతో రెండు డజన్ల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే టీఆర్‌ఎస్‌ పతనం అవుతుందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన వైఖరి మార్చుకోవాలని తరుణ్‌ చుగ్‌ అన్నారు.

Related Articles

Latest Articles