తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లు… నలుగురి అరెస్ట్

తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్

నకిలీ టిక్కెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముగ్గురు భక్తులను విజిలెన్స్ అధికారులు విచారించగా ఈ వ్యవహారం బట్టబయలైంది. అయితే కొన్నాళ్లుగా తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్ల అమ్మకాల వ్యవహారం జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో స్పష్టమైంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకులైన భక్తులను టార్గెట్ చేసుకుని నిందితులు దర్శనం టిక్కెట్ల పేరుతో ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని సమాచారం.

Related Articles

Latest Articles