దొంగనోట్ల ముఠా గుట్టురట్టు..

ఈజీమనీకి అలవాటుపడిన జనం కష్టపడకుండా ఇతరుల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో దొంగనోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టుని రట్టుచేశారు బొబ్బిలి పోలీసులు. గొర్రెల కాపరి ఫిర్యాదు మేరకు దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. కొద్ది రోజులు క్రితం బలిజిపేట సంతలో రూ.11,500 లకి గొర్రెలను అమ్మారు బొబ్బిలి మండలం శివడావలస గ్రామానికి చెందిన జాడ సోములు. రూ.11,500 లో రూ. 10 వేల దొంగనోట్లు ఇచ్చారు ఐదుగురు ముఠా సభ్యులు. 10 వేలును వేరొక చోట ఇవ్వగా.. దొంగనోట్లని తేలడంతో బలిజిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు జాడ సోములు.

బాధితుడ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భీమిలికి చెందిన పోలీసులు త్రాసుల సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన నలుగురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల దగ్గర నుండి కలర్ ప్రింటింగ్ మిషన్, 52 వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

భీమిలి కేంద్రంగా దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు. జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లో దొంగనోట్ల మార్పిడి చేస్తున్నారు. భీమిలి లో ప్రింటింగ్ చేస్తున్న మిషన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు లో ప్రతిభ కనబర్చిన పోలీసుల్ని అభినందించారు.

Related Articles

Latest Articles