‘సీ యూ సూన్ 2’… కొత్త రకం చిత్రానికి… సరికొత్త సీక్వెల్!

‘సీ యూ సూన్’ అనే సినిమాతో పోయిన సంవత్సరం అందరి దృష్టినీ ఆకర్షించారు మహేశ్ నారాయణన్, ఫాహద్ ఫాసిల్. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫాహద్ చేసిన ‘సీ యూ సూన్’ 2020లో తొలి ‘డెస్క్ టాప్ మూవీ’గా నమోదవుతూ లాక్ డౌన్ కాలంలో ఓటీటీకి వచ్చింది. ‘డెస్క్ టాప్ మూవీ’ అంటే సినిమా కథలోని మొత్తం కానీ, అత్యధిక శాతం కానీ ఓ కంప్యూటర్ లో రివీల్ కావటం! అంటే, సినిమాకి డెస్క్ టాప్ లేదా మొబైల్ లేదా ల్యాప్ టాప్ కీలకం అవుతాయన్నమాట!

‘సీ యూ సూన్’తో సరికొత్త ప్రయోగం చేసేన మహేశ్, ఫాహద్ ఇప్పుడు ‘సీ యూ సూన్ 2’పై స్పందించారు. తమ ఫస్ట్ డెస్క్ టాప్ మూవీకి సీక్వెల్ తీస్తామన్నారు. కానీ, థియేటర్ లు తెరుచుకుని మార్కెట్ సాధారణ స్థితికి వచ్చాకే అని క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు, ‘సీ యూ సూన్’కి ‘సీ యూ సూన్ 2’ కంటిన్యుయేషన్ కాదని కూడా ఫాహద్ ఫాసిల్ చెప్పాడు. మొత్తం సరికొత్తగా తమ ‘సెకండ్ డెస్క్ టాప్ మూవీ’ ఉంటుందని ఆయన స్పష్టతనిచ్చాడు. అయితే, అదే సందర్భంలో మాట్లాడుతూ దర్శకుడు మహేశ్ నారాయణన్ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు…

మలయాళ సినిమా ఇంకా రెండు వందలు, మూడు వందల కోట్ల కలెక్షన్స్ మైలురాయిని అందుకోలేకపోయింది. తమ సినిమాలు వసూళ్ల పరంగా తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడలేకపోవటానికి కారణం మాలీవుడ్ పనితీరు వేరుగా ఉండటమేనని దర్శకుడు మహేశ్ అన్నాడు. తాము చాలా వరకూ ఏదో ఒక కొత్తదనంతో జనం ముందుకొచ్చే ప్రయత్నం చేస్తామనీ, ఇతర సినీ పరిశ్రమల్లో ఉన్నట్టుగా కలెక్షన్ల ఒత్తిడి తమ వద్ద ఉండదనీ… నారాయణన్ చెప్పాడు. ఫాహద్ ఫాసిల్ కూడా మలయాళ సినిమాల కలెక్షన్స్ గురించి చెబుతూ… సినిమా రూపొందిన తరువాత ‘అదే’ తన ప్రయాణాన్ని నిర్ణయించుకుంటుందని అన్నాడు. సినిమా ఎంత వసూలు చేస్తుందన్నది మేకర్స్ చేతుల్లోనో, యాక్టర్స్ మార్కెట్ మీదో ఆధారపడదని అన్నాడు.
మహేశ్ నారయణన్ దర్వకత్వంలో ఫాహద్ ఫాసిల్ హీరోగా నటించిన ‘మలిక్’ జూలై 15న అమేజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-