కొత్త వాద‌న‌: అమెజాన్ బాస్‌ను ఎలియ‌న్లు క‌డ్నాప్ చేశాయ‌ట‌…

ఇటీవ‌లే అమెజాన్ బాస్‌ జెఫ్ బెజోస్ అంత‌రిక్షంలోకి వెళ్లొచ్చారు.  బ్లూఆరిజిన్ సంస్థ త‌యారు చేసిన న్యూషెప‌ర్డ్ వ్యోమ‌నౌక‌లో జెఫ్ బెజోస్‌తో పాటుగా ఆయ‌న సోద‌రుడు మార్క్, మ‌రో ఇద్ద‌రు కూడా అంత‌రిక్షంలోకి వెళ్లారు.  వీరు భూమి మీద నుంచి బ‌య‌లుదేరి అంత‌రిక్షంలోకి వెళ్లి తిరిగి రావ‌డానికి ప‌ట్టిన స‌మ‌యం 11 నిమిషాలు.  అయితే, ఇప్పుడు కొంద‌రు ఓ వితండ వాదానికి తెర‌తీశారు.  అమెజాన్ బాస్ జెఫ్ అంత‌రిక్షంలోకి వెళ్లిన త‌రువాత ఆయ‌న్ను ఏలియ‌న్స్ కిడ్నాప్ చేసి ఆయ‌న డ‌బుల్ బాడీని స్పేష్ ష‌టిల్ లో ఉంచారని, అందుకు ఎలియ‌న్స్ మాదిరిగా ఉన్న ఆయ‌న మెడ‌ను చూస్తేనే అర్ధం అవుతుంద‌ని అంటున్నారు.  అయితే, ఈ వాద‌న‌ను అమెజాన్ సంస్థ కొట్టిపారేసింది.  11 నిమిషాల వ్య‌వ‌ధిలో ఎలా కిడ్నాప్ చేస్తార‌ని, ప‌క్క‌న మ‌రో ముగ్గురు వ్య‌క్తులు ఉండ‌గా కిడ్నాప్ ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  ఇవ‌న్నీ అర్ధంలేని వితండ వాద‌న‌లు అని అమెజాన్ సంస్థ తెలిపింది.  

Read: మళ్ళీ మొదలైన ‘రైడ‌ర్’ మూవీ షూటింగ్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-