ఫేస్‌బుక్ నుంచి స్మార్ట్ వాచ్ః రిలీజ్ ఎప్పుడంటే…

ప్రముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు యాపిల్‌, గూగుల్ సంస్థ‌లు స్మార్ట్ వాచ్ యుగాన్ని న‌డిపిస్తున్నాయి.  ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా రంగంలోకి దిగుతుండ‌టంతో త్రిముఖ‌పోటీ ఉండే అవ‌కాశం ఉన్న‌ది.  ఇత‌ర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్న‌ప్ప‌టికీ, ఇందులో అద‌నంగా మ‌రికోన్ని ఫీచ‌ర్లు ఉండ‌బోతున్నాయి.  ఈ వాచ్‌లో కెమెరా ఉంటుంది.  ఈ కెమెరా స‌హాయంతో వీడియో కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు.  అదేవిధంగా, వెనుక 1080 పిక్స‌ల్ కెమేరా ఉంటుంది.  దీని స‌హాయంతో వీడియోల‌ను తీసి ఫేస్‌బుక్ త‌దిత‌ర యాప్స్‌లో నేరుగా అప్లోడ్ చెయవ‌చ్చు.  వ‌చ్చే ఏడాది వేస‌వికి దీనిని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  దీని ధ‌ర $400 ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-