ట్రంప్‌కు మ‌ళ్లీ షాకిచ్చిన ఫేస్‌బుక్‌

అగ్ర‌రాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మ‌రోసారి షాక్ ఇచ్చింది సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓట‌మి త‌ర్వాత హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.. జనవరి 6వ తేదీన‌ క్యాపిటల్‌ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజ‌యాన్ని చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ అభిమానులు, ఆ భ‌వ‌నంపై దాడికి దిగ‌డం.. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు.. అయితే.. దీనికి కార‌ణం ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టులే కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. దీంతో.. ఆ పోస్టులను తొలగించడ‌మే కాదు.. ట్రంప్ ఖాతాల‌పై బ్యాన్ విధించాయి సోష‌ల్ మీడియా సంస్థ‌లు.. ఇప్పుడు ఆ బ్యాన్‌ను మ‌ళ్లీ పొడిగించింది ఫేస్‌బుక్‌.. కనీసం 2023 వరకూ ట్రంప్ ఖాతాను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ఫేస్‌బుక్ పేర్కొంది. ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించగలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాల‌ని పేర్కొంది ఫేస్‌బుక్‌.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-