ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు

ఇది క‌రోనా కాలం.. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే, త‌మ‌కు అందుబాటులో ఉన్నపీహెచ్‌సీ ఏది..? ఎక్క‌డ టెస్టులు చేయించుకోవాలి..? మ‌రెక్క‌డ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసిన‌వారిని అడిగి వాకాబు చేయాల్సిన ప‌రిస్థితి.. అయితే, ఈ క‌ష్టాల‌కు చెక్‌.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్‌బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్‌బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండ‌ర్ టూల్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. మొబైల్ యాప్‌లో ఈ టూల్ అందుబాటులోకి తెస్తుంది ఎఫ్‌బీ.. ఈ టూల్‌ను భార‌త ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యంతో రూపొందించామ‌ని, మొత్తం దేశంలోని 17 స్థానిక భాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని చెప్పింది.

ఇది అందుబాటులోకి వ‌స్తే.. వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అనుకునే వాళ్లు త‌మ ద‌గ్గ‌ర‌లోని వ్యాక్సిన్ సెంట‌ర్ల‌ను ఈ టూల్ ఉప‌యోగించి తెలుసుకోవ‌చ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివ‌రాల ఆధారంగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల లొకేష‌న్ల‌తో పాటు అవి ప‌ని చేసే వేళ‌ల‌ను ఈ ఫేస్‌బుక్ టూల్ వెతికి పెట్ట‌నుంది. ఇక‌, ఈ టూల్‌లో కొవిన్ పోర్ట‌ల్ లింకు కూడా ఉంటుంద‌ని.. దీని ద్వారా నేరుగా పోర్ట‌ల్‌లోకి వెళ్లి వ్యాక్సినేష‌న్ అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-