ప్రపంచవ్యాప్తంగా నిలిచిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు

వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. 20 నిమిషాలుగా పనిచేయని సేవలు.. ఫేస్‌బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ఫీడ్‌ రీఫ్రెష్‌ కూడా కాకపోవడంతో యూజర్ల నుంచి అసహనం వ్యక్తమైంది. అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు.

సోషల్ మీడియా నేడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా సేవలన్నీ నిలిచిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఫోన్ సమస్యా.. ? లేకా నెట్వర్క్ సమస్యా.. ? అనేది తెలియక గందరగోళానికి గురయ్యారు. అనేక మంది యూజర్లు ఆయా యాప్ ను అన్ ఇన్స్టాల్ చేసుకుని మళ్లీ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వారు వెల్లడించారు. ఇక ఫేస్బుక్ సేవలపై ట్రోల్స్ కూడా అప్పుడే మొదలైయ్యాయి.

-Advertisement-ప్రపంచవ్యాప్తంగా నిలిచిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు

Related Articles

Latest Articles