అనిల్ రావిపూడికి ‘ఎఫ్ 3’ టీమ్ బర్త్ డే విషెస్!

‘పటాస్’ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఒక చిత్రాన్ని మించిన విజయాన్ని మరో చిత్రంతో అందుకుంటూ ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. ఈ ఆరేళ్ళలో అనిల్ దర్శకత్వం వహించింది కేవలం ఐదు చిత్రాలే అయినా, తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం అతనేమిటో చెప్పకనే చెబుతాయి.

2019, 2020 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. అందుకే 2022లో ‘ఎఫ్ 3’ మూవీని సంక్రాంతికి విడుదల చేసి ఆ సీజన్ లో హ్యాట్రిక్ సాధించాలని అనిల్ రావిపూడి అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ కోరిక తీరడంలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ‘ఎఫ్ 3’ మూవీ ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ‘తన సినిమా విడుదల రోజే తనకు పండగ’ అని చెబుతున్న అనిల్ రావిపూడిని ఆ చిత్రం బృందం హాస్యబ్రహ్మ జంధ్యాల, ఆయన శిష్యుడు ఇవీవీ సత్యనారాయణలతో పోల్చుతోంది. అంతేకాదు… అనిల్ రావిపూడికి ఈ చిత్ర బృందంతో పాటు నిర్మాత ‘దిల్’ రాజు సైతం బర్త్ డే విషెస్ తెలిపారు. దానికి సంబంధించిన వీడియోను అనిల్ రావిపూడి బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

Related Articles

Latest Articles