సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న “ఎఫ్ 3”

2022 సంక్రాంతి సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఇప్పటికే నలుగురు హీరోలు సిద్ధమయ్యారు. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న విడుదల కానుండగా, ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, ‘సర్కారు వారి పాట’ జనవరి 13న, ‘రాధే శ్యామ్’ జనవరి 14 తేదీల్లో విడుదల కానుంది. మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఎఫ్3” సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావిస్తుండగా, తాజాగా మేకర్స్ ప్రకటనతో ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టమైంది. 2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్‌’ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Also : మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన

ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి “ఎఫ్ 3” సంక్రాంతి రేసులో పోటీ పడబోతోందని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. శివరాత్రి కానుకగా కాస్త ముందుగానే ‘ఎఫ్ 3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమవుతోంది.

Related Articles

Latest Articles