వరదలతో నీట మునిగిన బెంగళూరు, చైన్నై

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్‌ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలు వరద ముప్పులోనే ఉన్నాయి.

దీంతో అధికారులు ఆ ప్రాంతాలను సందర్శిస్తు సహాయక చర్యలను చేపడు తున్నారు. తిరువల్లూరు జిల్లాలోని పూండి రిజర్వాయర్‌కు పూర్తి సామర్థ్యాన్ని మించి వరద పోటెత్తడంతో గత కొన్ని రోజులుగా సెకనుకి 3వేల క్యూబిక్‌ నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో రిజర్వాయర్‌ నుండి నీటి విడుదలను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం బోట్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు అల్లలసంద్ర సరస్సు పొంగిపొర్లడంతో కర్ణాటక రాజధాని బెంగళూరుకు కూడా వరద పోటెత్తింది. సరస్సు పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారంరాత్రి కురిసిన వర్షాలకు ఉత్తర బెంగళూరులోని పలు రహదారులు జలమయ్యాయి. యహలంక, నాగవర, కొగిలు క్రాస్‌, విద్యారణ్యపుర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. యహలంకలో గత 24 గంటల్లో అత్యధికంగా 153 మి.మీ వర్షం కురి సింది. వరదలకు ఏపీలో పలు చోట్ల రైల్వే ట్రాక్స్‌ దెబ్బతినడంతో పలురైళ్లను నిలిపివేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

Related Articles

Latest Articles