వైసీపీలో తీవ్ర విషాదం, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. !

వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవీ. రమణారెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి కర్నూల్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అటు రమణా రెడ్డి మృతి పట్ల తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా… అప్పట్లో ఎన్టీఆర్‌ ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి రాయల సీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు. సీమ హక్కుల కోసం కూడా రమణా రెడ్డి పోరాటం చేశారు. అలాగే…1983 లో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

-Advertisement-వైసీపీలో తీవ్ర విషాదం, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. !

Related Articles

Latest Articles