చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపం: పరిటాల సునీత

అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ఏపీకి సీఎం అయ్యింది చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించడానికే అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఒకపక్క రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రజలు కొట్టుకుపోతుంటే మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయాలు బయటకు వస్తాయనే ఇలా తిట్టిస్తున్నారని.. ఇంకోసారి తమ నాయకుడి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రులను, వైసీపీ ఎమ్మెల్యేలను పరిటాల సునీత హెచ్చరించారు.

అవతలి వాళ్ల కన్నీళ్లు చూసి సైకోలే ఆనందిస్తారు: వంగలపూడి అనిత

ఏపీలో ప్రతిపక్షం ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని… ఇది సరికాదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. వైసీపీకి చెందిన ప్రతి నాయకుడు కుప్పం గురించి మాట్లాడుతున్నారని… జగన్ మెప్పు పొందేందుకు పోటీలు పడి చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో మూడు నెలలు ఉండి ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున పంచారని ఆరోపించారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో వాస్తవాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని… వీటిపై చర్చ జరగాలని ఆనందబాబు అన్నారు. రేపటి నుంచి దీనిపై గ్రామ స్థాయిలో చర్చ పెడతామని చెప్పారు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారని… ఆయన కంటతడి రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని కోల్పోరని… తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పారు.

చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపం: పరిటాల సునీత

ఏపీలో ప్రజాస్వామ్యం కిరాతకుల చేతిలో అత్యాచారానికి గురైందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిని అనాల్సిన మాటలేనా ఇవి అంటూ వైసీపీ నేతలను నిలదీశారు. దేవాలయం లాంటి సభలో ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే వారి చేత క్షమాపణలు చెప్పించాలన్న ఇంగితజ్ఞానం లేదా అని జగన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు కళ్ల లో వచ్చిన కన్నీరు రాష్ట్రంలో లక్షల మందికి కన్నీళ్లు వచ్చాయన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను బజారులో పిచ్చికుక్కని కొట్టినట్టు తరుముతామని హెచ్చరించారు. కొడాలి నాని సంస్కార హీనుడని.. చంద్రబాబు భిక్షతో బ్రతికిన కొడాలి ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్నాడని ఫైర్ అయ్యారు. తమ నాయకుడి కంట కారిన కన్నీరు వైసీపీని భూస్థాపితం చేస్తాయని స్పష్టం చేశారు.

చంద్రబాబు కంటతడి వైసీపీ నేతలకు శాపం: పరిటాల సునీత

Related Articles

Latest Articles