కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు.. మాజీ మంత్రి ఫైర్‌

వినాయక చవితి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది… సీఎం వైఎస్‌ జగన్‌, ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి… ఇక, వ్యవహారంలో సీఎం జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి కిడారి.. వినాయక చవితి వేడుకలు రద్దు చేయడం ఏంటి? అని ప్రశ్నించిన ఆయన.. కులాలు, మతాల మధ్య సీఎం జగన్ చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.. వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించిన ఆయన.. తల్లిదండ్రులు వద్దంటున్నా విద్యాసంస్థలను ప్రారంభించారు.. మరి పిల్లలకు కరోనా రాదా..? అని ప్రశ్నించారు..

మరోఐపు.. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు వైన్ షాప్ లను బార్లా తెరిచి.. మద్యం అమ్మకాలు సాగించారు.. ఇప్పుడు ఒక మతానికి చెందిన పండుగను జరుపుకోవడం వద్దనడం దురదృష్టకరం అన్నారు కిడారి శ్రావణ్ కుమార్.. మీకు చేతనైతే, హిందూ మతం మీద అభిమానం ఉంటే రామతీర్థం నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి అని డిమాండ్‌ చేసిన ఆయన.. ప్రజావ్యతిరేక విధానాలు ఉంటే ఆంక్షలు విధించండి.. కానీ, పండుగలను మాత్రం చేసుకోనివ్వండి అని సూచించారు. సంప్రదాయాలను, పండుగలను ఆపే పనులు చేయడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు కిడారి.

Related Articles

Latest Articles

-Advertisement-