హరీష్ రావు అబద్దాల కారు కూతలు కూస్తున్నారు : ఈటల

హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు.. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అని తెలిపారు. కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవు. నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా అని అడిగారు ఈటల రాజేందర్.

Related Articles

Latest Articles

-Advertisement-