బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా : ఈటల

బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంత దాదా గిరి చేస్తున్న నీకే ఇంత ఉంటే మాకు ఎంత ఉండాలి. మాకు సహనం ఉంది మౌనంగా చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్క వేసి పెట్టుకుంటున్నాము. సందర్భం వచ్చినప్పుడు నీ భరతం పడతాం. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా హుజురాబాద్ లో గెలవలేరు అని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్న తాగుడు ఆపి, కొనుగోళ్లు ఆపి ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లడుతే మీకు డిపాజిట్ కూడా రాదు కేసీఆర్. ఆయన అసెంబ్లీ లో నా ముఖం చూడవద్దు అనుకుంటున్నారు. కేసీఆర్ నా ముఖం చూడలేరు కాబట్టి నేను గెలిస్తే వెంటనే రాజీనామా చేయండి అని చెప్పిన. పెన్షన్లు సిద్దిపేట వారు వచ్చి ఇస్తున్నారు అంటే ఎంత దిగజారి పోయారు. దళిత బంధు ఎప్పుడో ప్లాన్ చేసిన అంటున్నారు.. మరి నేను ఆర్థిక మంత్రిగా పని చేసిన ఏ రోజు కూడా ఈ స్కీం వినబడలేదు . హుజూరాబద్, జమ్మికుంటకి ఎప్పుడో 40,40 కోట్లు మంజూరు చేయిచుకున్న. కానీ కేటీఆర్ పనులు చేయకుండా అడ్డు పడ్డారు. కానీ ఈరోజు అదే పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న పథకాలు అన్నీ నా మీద భయంతో ఇస్తున్నవే అని ఈటల పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-