నేను ఏంటో నాకు తెలుసు.. కేసీఆర్‌ ఆదేశిస్తే పార్టీలో చేరతా..

నేను ఏంటో నాకు తెలుసు.. నా పై విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోను అన్నారు తాజాగా ఐఏఎస్‌ పోస్ట్‌కు రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ఆయన రాజీనామా చేయడం.. ప్రభుత్వం ఆమోదించడం వెనువెంటనే జరిగిపోయాయి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని ప్రకటించారు.. నా పై విపక్ష పార్టీలు చేసే విమర్శలకు బదులు ఇవ్వను… నేను ఏంటో నాకు తెలుసన్న ఆయన.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్‌ వైపు ఆకర్షితుడిని అయ్యానని తెలిపారు.. ఇక, టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నందుకు ఎటువంటి పదవి కూడా ఆశించడం లేదన్నారు వెంకట్రామిరెడ్డి. కాగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సమయంలో.. ఆయన రాజీనామా చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారు అయ్యిందని.. అందుకే ఐఏఎస్‌గా రాజీనామా చేశారనే చర్చ కూడా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles