జై భీమ్‌ సినిమా కోసం ఎలుకల కూర తిన్నా: లిజోమోల్‌ జోస్‌

ఇప్పుడు ఎక్కడ చూసినా త‌మిళ హీరో సూర్య న‌టించిన జై భీమ్ గురించే టాపిక్‌. అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. టీజే జ్ఞాన‌వేల్ దర్శక త్వంలో 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. అమాయ‌కులైన గిరిజ‌నుల‌పై కొంద‌రు పోలీ సులు అక్రమ కేసులు బ‌నాయించి, నేరాలు ఒప్పుకునేందుకు ఎలాం టి చర్యలకు దిగుతార‌నే ఇతివృత్తంతో జై భీమ్ తెర‌కెక్కింది. గిరిజ‌న వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడే లాయ‌ర్ చంద్రు పాత్రలో సూర్య క‌ని పించ‌గా.. స‌మాజంలో దాష్టీకానికి బ‌లై.. న్యాయ‌పోరాటానికి దిగిన మ‌హిళ‌గా లిజోమోల్ జోస్ న‌టించింది.

త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో 1993లో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న ఆధారంగా జై భీమ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో చిన‌త‌ల్లి పాత్రలో న‌టించిన లిజోమోల్ న‌ట‌న గురించి ఎంత మాట్లాడుకున్నా త‌క్కువే. పోలీసుల అరాచకానికి బ‌లైన‌ భ‌ర్త కోసం త‌ల్లడిల్లిపోయే పేద గిరిజ‌న యువ‌తి చిన‌త‌ల్లి పాత్రలో జీవించేసింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న చూసిన త‌ర్వాత అస‌లు లిజోమోల్ ఎవ‌రు అని చాలామంది ఆన్‌లైన్‌లో వెతుకులాట ప్రారంభించారు.జై భీమ్‌ సినిమాలో సినతల్లి గా నటించి ప్రశంసలు అందుకుంది లిజోమోల్‌ జోస్‌ గిరిజన మహిళా గా, గర్భవతిగా కష్టాలు పడుతూ కన్నీళ్లూ పెట్టించింది. అయితే ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని లిజోమోల్‌ పేర్కొంది. రోజు గిరిజన గుడిసెలకు వెళ్లి వాళ్లతో కలిసి పనిచేచశానిని చెప్పు కొచ్చింది. వాళ్లలా ఉండాలని ఎలుకల కూర కూడా తిన్నా అని, అచ్చం చికెన్‌ కర్రీలా అనిపించిందని సినతల్లి చెప్పుకొచ్చింది. పాము కాటుకు మందు ఇవ్వడం కూడా నేర్చుకున్నట్టు తెలిపింది లిజోమోస్‌ జోస్‌.

Related Articles

Latest Articles