ఒమిక్రాన్‌… ఓ అన్‌స్టాప‌బుల్ వేరియంట్‌…

క‌రోనా మ‌హ‌మ్మారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తున్న‌ది.  యూర‌ప్‌, అమెరికా దేశాల‌ను ఒమిక్రాన్ డామినెట్ చేయ‌డంతో అక్క‌డ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  అమెరికాలో రోజుకు 11 నుంచి 13 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌వుతున్నాయి.  అక్క‌డి చాలా రాష్ట్రాల్లో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు.  రోజుకు ల‌క్ష మందికిపైగా ఆసుప‌త్రుల్లో చేరుతున్నారు.  ఇండియాలోనే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఒమిక్రాన్ వ్యాప్తి కార‌ణంగానే కేసులు పెరుగుతున్నాయి.  అయితే, డెల్టా కంటె ప్ర‌మాద‌క‌రం కాద‌ని నిపుణులు చెబుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాల‌జీ సైంటిఫిక్  అడ్వైజ‌రీ క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ డాక్ట‌ర్ జ‌య్‌ప్ర‌కాశ్  ఒమిక్రాన్ వేరియంట్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

Read: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వాన‌రం అంత్య‌క్రియ‌ల‌కు భారీగా హాజ‌రైన జనం…ప్ర‌భుత్వం ఆగ్ర‌హం…

ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం చాలా క‌ష్టం అని, అది  ఓ అన్‌స్టాప‌బుల్ వేరియంట్ అని చెప్పారు.  వ్యాధిని మ‌నం కంట్రోల్ చేయ‌వ‌చ్చు… కానీ వైరస్‌ను కంట్రోల్ చేయ‌డం సాధ్యం కాద‌ని, దానంత‌ట అదే స‌మ‌సిపోవాల‌ని అన్నారు.  వైర‌స్ సోకిన త‌రువాత దాని వ‌ల‌న క‌లిగే వ్యాధి ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించేందుకు వైద్య చికిత్స అందుబాటులో ఉంద‌ని చెప్పారు.  డెల్టా కంటే ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ వేరియంట్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని అన్నారు.  మిగ‌తా దేశాల‌తో పోలిస్తే మ‌న‌దేశంలో ముప్పు త‌క్కువ‌గా ఉంద‌ని, దానికి కార‌ణం మ‌న‌లో స‌హ‌జ‌సిద్దంగా ఉన్న వ్యాధినిరోధ‌క శ‌క్తే కార‌ణ‌మ‌ని అన్నారు.  వ్యాక్సిన్ రాక‌మునుపై చాలా మందికి వైర‌స్ సోకి ఉంటుంద‌ని, శ‌రీరంలోని స‌హ‌జ‌సిద్ద‌మైన వ్యాధినిరోధ‌క శ‌క్తి కార‌ణంగా చాలా మందిలో క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టుకూడా తెలియ‌లేద‌ని అన్నారు.  

Related Articles

Latest Articles