వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధం

వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు రంగం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది రానున్నారు. డీజీ సూచనలతో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న 960 మంది ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైలుకు అధికారులు తరలించనున్నారు. అనంతరం స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్వాధీనం చేసుకోనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-