దీపావళి కానుకగా మార్వెల్ స్టూడియోస్ నుండి మరో మూవీ!

గత వారం ‘షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీ రిలీజ్ అయ్యింది. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యేడాది మార్వెల్ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన సినిమాను జనం ముందు తీసుకురాబోతోంది. పలువురు హాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇటర్నల్స్’ను దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్లోయూ జావ్ రూపొందించిన ఈ సూపర్ హీరోస్ మూవీలో రిచర్డ్ మాడెన్, గెమ్మ చాన్, కుమాయిల్ నంజియాని, లారెన్ రిడ్ లాఫ్, బ్రియాన్ టైరీ హెన్రీ, సల్మా హయెక్, ఏంజెలీనా జోలీ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్

ఈ సినిమాను నవంబర్ 5న ఇంగ్లీష్‌ తో పాటు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మానవ జాతి పురాతన శత్రువు డెవియెంట్స్ ను ఎదుర్కొనడానికి అమరవీరులంతా కలిసి ఎలాంటి పోరాటం చేశారనే పురాణగాథ ఆధారంగా ‘ఇటర్నల్స్’ను మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది. నిజానికి ఈ సినిమా గత యేడాది నవంబర్ 6న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ యేడాది ఫిబ్రవరికి, ఆ తర్వాత మే నెలకు మారి… ఇప్పుడు ఫైనల్ గా నవంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇటీవల వచ్చిన ‘బ్లాక్ విడో, షేంగ్ ఛీ’ చిత్రాలకు థియేటర్లలో ఆదరణ బాగానే ఉండటంతో ఈ సినిమా విజయంపైనా దర్శక నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-