కేవలం మీ ఓట్ల కోసమే హామీలు : ఈటల

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి నేడు ఈటల ఎన్నికల ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట. నామీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. వాళ్ల నియోజకవర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీలిస్తున్నారు. దళితబంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ మీపై ప్రేమతో కాదు అని తెలిపారు. కేవలం మీ ఓట్ల కోసమే హామీలు. దళితబంధులాగే.. అన్ని కులాల్లోని పేదలకు పదిలక్షలు ఇవ్వాలి అన్నారు. ఓటుకు 20 వేల నుంచి 50 వేలు ఇస్తారట.. అవన్నీ అవినీతితో సంపాదించిన సొమ్ము తీసుకోండి. కానీ ఓటు మాత్రం కమలానికే వేయండి అని పేర్కొన్నారు ఈటల.

-Advertisement-కేవలం మీ ఓట్ల కోసమే హామీలు : ఈటల

Related Articles

Latest Articles