కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా పని చేద్దాం : ఈటల

అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత  భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ రాజులు అని చదువుకుంటారు. కేసీఆర్ ఓ చెడ్డ రాజు. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల్లో వెయ్యి కోట్లు ఖర్చుపెట్టెను, వంద కోట్లు మందు తాగించెను, 4500 కోట్ల జీవోలు ఇచ్చెను, అయినా మట్టి కరిసెను అని చరిత్ర చదువుకోబోతుంది. మొన్న వచ్చిన సర్వేలో కేసీఆర్ చెత్త ముఖ్యమంత్రి అని తేలింది. అందుకే కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చారిత్రక కర్తవ్యం మీ చేతుల్లో ఉంది అంటూ యువతకు భాద్యతలు అప్పగించిన ఈటల రాజేందర్. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. మన కళ్ళల్లో మట్టి కొట్టారు. తెలంగాణ అభివృద్ధి కుంటుపడేలా చేశారు. ఆయన్ను గద్దెదించడమే లక్ష్యంగా పని చేద్దాం అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles