జూన్ రెండున ఎమ్మెల్యే పదవికి ఈటల రిజైన్ ?

తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్ని కలిశారు. దీంతో ఈటల కాంగ్రెస్‌లో లేక బీజేపీలో చేరుతారా లేక కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు, ఇటీవలే జరిగిన పరిణామాలు అందుకు మరింత బలం చేకూర్చాయి. ఈ రెండ్రోజుల్లో ఆయన బీజేపీ ముఖ్య నేతల్ని కలిశారు. ఇదిలావుంటే, రేపు ఉదయం ఎనిమిది గంటలకు మాజీ మంత్రి ఈటల శామీర్ పేటలోని ఆయన నివాసంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 2వ తేదీన ఎమ్మెల్యే పదవికి ఈటల రిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-