పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటలదే గెలుపు..! మళ్లీ పాదయాత్ర..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని చేశాం.. యాక్షన్, డ్రామాలు చేసే వాళ్లం కాదు.. కన్నీళ్లు వచ్చినా, సంతోషం వచ్చినా లోపల దిగమింగుకున్నామని తెలిపారు.. నా లాంటి వాళ్ల మీద మాట్లాడడం అంటే సూరిని మీద ఉమ్మినట్టే అన్నారు ఈటల.. ఏ పదవి రాని కార్యకర్తలు పెనుగులాడుకుంటున్నారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ ఆయిన ఉండవచ్చు.. కానీ, ఈటల రాజేందర్ తో తిరిగినా, సహకరించినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

నక్సలైట్లకు అన్నం పెడితే ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.. పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరిస్తున్నారన్న ఆయన.. ఇవన్నీ నిలువరించే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు.. ఇక, దవాత్ లేని గ్రామాలు లేవు.. ప్రలోభాలకు అప్పుడే తెరలేపారన్నారు మాజీ మంత్రి.. తాను పాదయాత్ర చేస్తున్న రూట్లలో ఫ్లెక్సీలు తొలగించి వారి ఫ్లెక్సీ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఒకప్పుడు కక్షలు, వైషమ్యాలు లేని నియోజకవర్గం హుజురాబాద్.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.. సర్పంచ్, ఎంపీటీసీ, పెద్ద మనిషి చెప్పితే ఓట్లు వేసి రోజులు పోయాయన్న ఆయన.. ఎందుకు ఓటు వేయాలని అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఓడి పోయే వాడు భయపడతాడు.. గెలుపు మీద నమ్మకం లేని వాడు అక్రమార్గంలో వస్తాడని ఎద్దేవా చేశారు ఈటల.. కాలం మూడింది… హుజురాబాద్‌కే పరిమితం కాదు మొత్తానికే ముప్పు వస్తుందని హెచ్చరించారు.. ఇక, సీఎం కేసీఆర్‌ అసహనంతో మాట్లాడుతున్నారని.. దళిత బంధును వెంటనే అమలు చేయాలని.. హుజురాబాద్ కే కాదు రాష్ట్రం అంత అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హుజురాబాద్ లో ఏమీ జరుగుతుంది అనేదానిపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలని కోరారు ఈటల రాజేందర్.

-Advertisement-పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటలదే గెలుపు..! మళ్లీ పాదయాత్ర..

Related Articles

Latest Articles