హుజూరాబాద్ ను జిల్లా చేయాలి : ఈటల

హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారు. నా వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ ను
జిల్లా చేయాలి, వావిలాల,చల్లుర్ లను మండలం వెంటనే చేయాలి అని తెలిపారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చు. అంటే అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని ఫోన్ చేసి మరీ ఒత్తిడి చేశారు. నియోజకవర్గంలో ఉన్న అందరు అధికారులను మార్చారు. ప్రత్యేక అధికారులను నియమించుకున్నారు. సొంత పార్టీ నాయకులను అంగట్లో సరుకులుగా కొంటున్నారు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

కుల సంఘాల నాయకులను సక్కగా రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్ళాలి అక్కడ హరీష్ రావు గారు ఉండి బేరం కుదుర్చుకుంటారు. ఇవన్నీ కాక దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నియోజక వర్గం కానీ వారికి ఓటు ఇక్కడ కల్పిస్తున్నారు. నాకు పడే ఓట్ల ను తొలగిస్తున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఇంట్ల 34 ఓట్లు ఉన్నాయి. ఇంకో నేత ఇంట్లో 41 ఓట్లు నమోదు చేశారు. దొంగ పనులు, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న అధికారుల మీద ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం. లేదంటే మా కార్యకర్తలే నిలువరించే ప్రయత్నం చేస్తాము. అధికారులు చట్ట ప్రకారం పని చేయండి, బానిసల్ల్లాగా కాదు. అలా చేస్తే మీకు శిక్ష తప్పదు. నియోజకవర్గ లో ఏ ఊరు పోయినా కెసిఆర్ ప్రభుత్వం చేసిన పని అత్యంత నీచంగా, జుగుప్ట్చకరంగా ఉంది అని అంటున్నారు. ఎంతో మందిని బయటికి పంపినా ఉద్యమం కదా అని ఊరుకున్నాము, కానీ ఇప్పుడు క్షమించేది లేదు అంటున్నారు. అవమానానికి బదలా తీర్చుకుంటామని అంటున్నారు. మైనారిటీ, క్రిస్టియన్ సోదరులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

ఈ ఎన్నికల కేసీఆర్ కి, ఈటల రాజేందర్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ధర్మమే గెలుస్తుంది అని ప్రజలు అంటున్నారు. ఓటుకు లక్ష రూపాయల ఇచ్చినా తీసుకుంటాం కానీ ఓటు మాత్రం ఈటల కే వెస్తామంటున్నరు. కమాలపూర్ మండలం బత్తిని వాని పల్లి నుండి పాదయాత్ర మొదలు పెడతాము. మూడు నాలుగు రోజుల్లో శ్రీకారం చుడతాము. 350 కిలోమీటరు ఉంటుంది. పోలీసులు తెరాస కార్యకర్తల వ్యవహరిస్తున్నారు. నిజాం అణచివేతను విన్నాం కానీ ఇప్పుడు రాజు గారు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా నిషేధిత పార్టీనా అని ప్రశ్నించారు. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలి అంటే తెరాస మంత్రుల ను కలవాలని హుకుం జారీ చేస్తున్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లో మాత్రమే డబుల్ బెడ్ రూం ఇల్లు పూర్తి చేశారు. నా దగ్గర కూడా 1500 డబుల్ బెడ్ రూం ఇల్లు కడుతున్నారు కానీ డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరి జాగా లో ఇల్లు కట్టుకొనే అవకాశం కల్పించాలి. ఎవరి తాత జాగీరు కాదు, ప్రజల పన్నులే ప్రభుత్వ ఖజానా నుండి సంక్షేమ పథకాలు ఇస్తారు. స్కీములు ఆపడం ఎవరి వల్ల కాదు. గెలిచే సత్తా లేక, ప్రజలమీద నమ్మకం లేక వారు ఈ చేస్టలు చేస్తున్నారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-