75 శాతం మంది ప్ర‌జ‌లు బీజేపీ వైపే ఉన్నారు… ఈట‌ల‌

ఈ రోజు హుస్నాబాద్‌లో బీజేపీ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ స‌భ‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ, తెలంగాణ బీజేపీ అద్య‌క్షుడు బండి సంజ‌య్‌, హుజురాబాద్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.  హుజురాబాద్‌లో కేసీఆర్ రాజ్యాంగం అమ‌లు అవుతుంద‌ని, మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని, ఇంత చేసినా త‌న‌ను ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని ఈట‌ల పేర్కొన్నారు.  అక్టోబ‌ర్ 30 న జ‌రిగే కురుక్షేత్ర యుద్ధంలో ధ‌ర్మం గెలుస్తుంద‌ని, అన్ని జిల్లాల నుండి ఈట‌ల‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌లు వ‌స్తున్నార‌ని అన్నారు.  తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌యాల‌కు అనుగుణంగా హుజురాబాద్ ప్ర‌జ‌లు ఓటు వేస్తార‌ని తెలిపారు.  75 శాతం ప్ర‌జ‌లు బీజేపీ వైపే ఉన్నార‌ని అన్నారు.  తాను చేసిన ప‌నుల‌ను చెరిపేసే స‌త్తా కేసీఆర్ చేతిలో లేద‌ని, ద‌ళితుల మీద ప్రేమ నిజ‌మే అయితే హుజురాబాద్ మొత్తం అమ‌లు చేయాల‌ని, రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ద‌ళిత‌బంధును అమ‌లు చేయాల‌ని అన్నారు.  

Read: వాటిని ప్యాకింగ్ చేసే ఉద్యోగాల‌కు రూ.63 ల‌క్ష‌ల జీతం…

-Advertisement-75 శాతం మంది ప్ర‌జ‌లు బీజేపీ వైపే ఉన్నారు... ఈట‌ల‌

Related Articles

Latest Articles