నడ్డాతో ఈటల కీలక భేటీ : వీటిపైనే చర్చ

బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై చర్చ జరుపనున్నారు. మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన సమర్థవంతమైన నాయకులకు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించాలని నడ్డాను కోరనున్నారు ఈటల. ఈ సమావేశంలో ఈ అంశంపై తనకున్న ఆలోచనలను నడ్డాకు వివరించనున్నారు. తెలంగాణలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజేపిని రూపొందించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ బిజేపి అద్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్.పి వివేక్ వేంకటస్వామి ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-