కెసిఆర్.. మానవత్వం లేని మనిషి : ఈటల

సీఎం కేసీఆర్‌ పై మరోసారి ఈటెల రాజేందర్‌ సంచలన కామెంట్‌ చేశారు. కెసిఆర్ కు నీతి, జాతి లేదు మానవత్వం లేదని.. అసలు మనిషే కాదని నిప్పులు చెరిగారు. భూ కబ్జా కేసు ఎందుకు పక్కకు పోయింది…తప్పు చేస్తే తనను జైలుకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఒక్క సారి తింటేనే మరచిపోమని… అలాంటిది ఇన్నాళ్లు కలిసి ఉన్న నన్ను ఇలా చేస్తావా? అంటూ నిలదీశారు.

Read Also : ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్

కెసిఆర్.. పైసలు ఇస్తే తీసుకోని ఓటు మాత్రం తనకు వేయాలని కోరారు ఈటల రాజేందర్‌. అసెంబ్లీ స్పీచ్ వినండి తన వేడి ఏంటో తెలుస్తుందని….తాను గెలిచిన తరువాత తెలంగాణలో విప్లవం వస్తుందని పేర్కొన్నారు. చిన్నవాడినే కానీ చిచ్చర పిడుగును అని పేర్కొన్న ఈటల తానను కాపాడాలి అనే తపనపడుతున్న వాళ్లకు పాదాభివందనమని తెలిపారు. పదవి గౌరవం పెంచాలి తప్ప అవమానపరచకూడదని.. అందుకే రాజీనామా చేశానని వెల్లడించారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-