ఈషా డియోల్ రిటర్న్స్… డిజిటల్ డెబ్యూకి హేమా మాలిని కూతురు సిద్ధం!

ఈషా డియోల్ తిరిగి వచ్చేస్తోంది. అయితే, హేమా మాలిని వారసురాలు పెద్ద తెర మీదకి రావటం లేదు. డిజిటల్ డెబ్యూతో స్మార్ట్ స్క్రీన్స్ పై సందడి చేయనుంది. ఈషా డియోల్ తక్తానీ పెళ్లి తరువాత పూర్తిగా కెమెరాకు దూరమైంది. అయితే, ఇప్పుడు తనని మిస్ అవుతోన్న ఫ్యాన్స్ కి మిసెస్ ఈషా డియోల్ ‘రుద్రా : ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో ఎంటర్టైన్మెంట్ పంచనుంది.

బ్రిటన్ లో సూపర్ సక్సెస్ అయిన బీబీసీ వారి వెబ్ షో ‘లూథర్’. అదే డార్క్ క్రైమ్ డ్రామా సీరిస్ ని బీబీసీ ఇండియా హిందీలో రీమేక్ చేస్తోంది. అయితే, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలసి బీబీసీ చేస్తోన్న ఈ ప్రయత్నంలో ‘రుద్ర’ వెబ్ సిరీస్ ఇండియన్స్ కి నచ్చేలా మార్పులుచేర్పులతో రాబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ లో అజయ్ దేవగణ్ టైటిల్ లో రోల్ లో కనిపిస్తాడు. ఆయనకి కూడా ‘రుద్ర’ సీరిసే డిజిటల్ డెబ్యూ ప్రాజెక్ట్! ఆయనతో బాటూ ఈషా డియోల్ కూడా భారీ గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకి రానుంది!

అజయ్ దేవగణ్, ఈషా డియోల్ స్టారర్ ‘రుద్ర’ ఈ సంవత్సరంలోనే డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులోకి వస్తుందంటున్నారు. ఈ సిరీస్ సక్సెస్ అయితే అజయ్ దేవగణ్, ఈషా డియోల్ బాటలోనే మరికొంత బాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటీటీ బాట పట్టే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-