ధాన్యం కోనుగోళ్ల విష‌యంలో అధికారుల‌ నిర్ల‌క్ష్యం : మంత్రి ఎర్రబెల్లి సీరియస్

ధాన్యం కోనుగోళ్ల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించే అధికారుల‌పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు హెచ్చ‌రించారు. శుక్ర‌వారం జ‌న‌గామ జిల్లా, కొడ‌కండ్ల మండ‌లం, రామ‌వ‌రం గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి రైతుల‌తో మాట్లాడారు. వానాకాలం సీజ‌న్ ప్రారంభ‌మైనందున రైతుల వ‌ద్ద ఉన్న ప్ర‌తి ధాన్యం గింజ‌ను కొనుగోలు చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఆదేశించినా.. ధాన్యం సేక‌ర‌ణ పూర్తి చేయ‌క‌పోవ‌డం ప‌ట్ల మంత్రి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌తో త‌డిసిన ధాన్యం కోనుగోలు చేయ‌డంలో రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న మిల్ల‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లో ధాన్యం సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-