సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి…

జిల్లాల అధికారులతో హరిత హారం పైనా వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కరోనా పేషంట్ లను కాపాడుకోవడంలో, వైరస్ వ్యాప్తి నివారణకు అందరూ బాగా కృషి చేశారు. రోడ్ ల పైన ఉన్నారు మొక్కలను కాపాడడటానికి మండల గ్రామ స్థాయిలో ప్రణాళిక రూపొందించాలి. రోడ్ కి ఇరు వైపులా పెద్ద పెద్ద చెట్లను నాటాలి. పారిశ్యుద్దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పది రోజుల్లో వైకుంఠ దామలలో అన్నీ సదుపాయాలు ఉండాలి. ప్రతీ గ్రామ సభలో అడిషినల్ కలెక్టర్, ఎంపీడీఓలు హాజరు కావాలి. తప్పనిసరిగా నెలలో కొన్ని రోజులు గ్రామ నిద్ర చేయాలి. ఉదయాన్నే గ్రామంలో నడిచి పరిశుభ్రత, గ్రీనరీ మొదలైన విషయాలు గమనించి సమస్య లు ఉంటే అక్కడే తీర్చాలి. వినియోగంలో లేని
బోర్లు పూడ్చి వేయాలి. ప్లాంటేషన్ కార్యక్రమం సజావుగా జరగాలి. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది.. అన్నీ గ్రామాల్లో పచ్చదనం, పారిశ్యుద్దాం నిర్వహణ సరిగ్గా ఉండాలి. కేంద్ర, రాష్ట్రల నుండి మనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అదే అభివృద్ధిని కొనసాగించాలి. గ్రామాల్లో ట్రాక్టర్ ల ద్వారా ప్రతీరోజు తడి, పొడి చెత్త ను డంప్ యార్డ్ కి తరలించాలి అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-