తిరుమలలో కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి : జవహర్ రెడ్డి

టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి అని సూచించారు. హనుమంతుని జన్మస్థలమైన ఆకాశగంగ వద్ద భక్తులు కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి సహకారంతో థీమ్ పార్క్ ఏర్పాటు.. అలాగే హనుమంతుని జన్మ వృత్తాంతం తెలిపేలా విందువల్లే ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఇక వచ్చే బ్రహ్మోత్సవాల లోపు నూతనంగా అభివృద్ధి చేసిన మ్యూజియం భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అని పేర్కొన్నారు జవహర్ రెడ్డి.

Related Articles

Latest Articles