చైతన్య చిలిపి చేష్టలు.. దక్ష కొంటె నవ్వులు..’ఎంత సక్కగుందిరో’..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా  జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో జాంబీ రెడ్డి ఫేమ్ దక్ష నగర్కార్ మెరిసింది. ‘ఎంత సక్కగుందిరో’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ సంక్రాంతి పండగను గుర్తుచేస్తోంది.

వయ్యారాలు పోతున్న దక్షను చూస్తూ.. ఆమె అందాలను చిన బంగార్రాజు పొగడడం.. దానికి దక్ష సిగ్గుపడడం చూస్తుంటే సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని అనసూయ సాంగ్ గుర్తుకొస్తుంది.. ఇక అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోను సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో బంగార్రాజు మాత్రమే ఉంది. సినీ అభిమానులందరూ కుటుంబాలతో కలిసి వెళ్ళడానికి సంక్రాంతిలాంటి సినిమా అని నాగార్జున తెలుపుతున్నారు. మరి ఈ సినిమా ఈ సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles