వేధించిన కాలేజీ యాజమాన్యం.. వీడియోతో విద్యార్థిని..!

ఘట్‌కేసర్ జోడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోంది. విద్యార్థిని లావణ్య తాను చనిపోయేముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బలవన్మరణానికి పాల్పడింది.. యాజమాన్యం తీరుపై కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయి. చదువులకు అధిక ఫీజులు చెల్లించడం.. కుటుంబాలకు భారం అవుతున్నామనే భావనలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-