జేబీఐటీ కాలేజీలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య

మొయినాబాద్‌ జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ రెండవ ఏడాది చదువుతున్న విద్యార్థి విజయ్ భాస్కర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విద్యార్ధి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తోంది జేబీఐటీ కాలేజ్ యాజమాన్యం.

జేబీఐటీ కాలేజ్ లో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు విజయ్ భాస్కర్. హాస్టల్ గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్ భాస్కర్. విజయ్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు. సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏం రాసాడో తెలియకుండా కాలేజ్ యాజమన్యం దాస్తోంది అని ఆరోపిస్తున్నారు విద్యార్థులు.

గతంలో కూడా ఫీజ్ కి సంబంధించి వేధింపులకు గురి చేశారు అని చెబుతున్నారు విద్యార్థులు. 10 రోజుల క్రితం విజయ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో కాలేజ్ యాజమాన్యం నిజాన్ని దాస్తోంది.విజయ్ కుటుంబానికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. గతంలో కూడా విద్యార్థులు కాలేజ్ యాజమన్యం ఒత్తిడి వలన చనిపోయారు అని చెబుతున్నారు విద్యార్థులు.

విద్యార్ధి ఆత్మహత్య ఘటనపై రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ మాట్లాడారు. విజయ్ భాస్కర్ అనే విద్యార్థి ఉదయం 9 30 గంటలకు చనిపోయాడు అని సమాచారం వచ్చింది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియవలపి వుందన్నారు. సూసైడ్ చేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. గతంలో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదు.విజయ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

Related Articles

Latest Articles