యూకే వర్సెస్ భారత్.. వ్యాక్సిన్ రగడ కొలిక్కి వచ్చేనా?

కొవీషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో యూకే వర్సెస్ భారత్ అన్నట్లుగా తాజాగా పరిస్థితులు మారిపోయాయి. కొవీషీల్డ్ టీకా తయారు చేసింది బ్రిటన్ దేశానికి చెందిన కంపెనీయే అయినప్పటికీ కూడా ఆదేశం భారతీయుల విషయంలో అవలంభిస్తున్న విధానం విమర్శలకు తావిస్తోంది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్ కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ ఆదేశం ప్రకటించడం విడ్డూరంగా మారింది. దీనిని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతుండటంతో కేంద్ర సర్కారు సైతం దీనిపై రియాక్ట్ అయింది.

యూకే విధానం సరైందని కాదని వెంటనే ఈ ప్రకటనను బ్రిటన్ ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. లేనట్లయితే ఇదే విధానాన్ని యూకే విషయంలోనూ భారత్ అవలంభించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇది మూమ్మాటికి కక్ష్య్యపూరితంగా ఉందంటూ స్పందించింది. వీలైనంత త్వరగా ఈ వివాదానికి బ్రిటన్ ఫుల్ స్టాప్ పెట్టేలా చూడాలని కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సూచించారు.

యూకే ఇటీవల నూతన ప్రయాణ విధానాలపై ఓ ప్రకటన చేసింది. దీనిలో భాగంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారత్, మరికొన్ని దేశాల ప్రయాణీకులు సైతం క్వారంటైన్లో ఉండాలని పేర్కొంది. వీరంతా తమ ప్రయాణానికి ముందుగా.. బ్రిటన్ చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పదిరోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాలని స్పష్టం చేసింది.

ఈ నిబంధనలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, శశిథరూర్ తప్పుబట్టారు. యూకే నిబంధనలు జాతి వివక్షతను పెంచేలా ఉన్నాయని.. ఇది మూమ్మాటికి నేరపూరిత చర్యేనని వారు దుయ్యబట్టారు. కాగా కొవీషీల్డ్ టీకా వాస్తవానికి యూకేకు చెందిన సంస్థదే. అంతేకాకుండా యూకే అభ్యర్థన మేరకే భారత్ 50లక్షల కొవీషీల్డ్ డోసులను భారత్ ఆ దేశానికి సరఫరా చేసింది.

ఆ దేశంలోనూ ఈ టీకాలను ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది. అలాంటిది యూకే మాత్రం కొవీషీల్డ్ టీకాను గుర్తించకుండా తాజాగా ప్రకటన చేయడం వివక్షపూరితమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ల విధానంలో అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.

అయితే యూకే మాత్రం తమ భాగస్వామ్య దేశాలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేయడాన్ని భారత్ తప్పుబడుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే భారత్… యూకే విదేశాంగ దృష్టికి తీసుకెళ్లింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూపాలని కోరింది. లేనట్లయితే బ్రిటన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

-Advertisement-యూకే వర్సెస్ భారత్.. వ్యాక్సిన్ రగడ కొలిక్కి వచ్చేనా?

Related Articles

Latest Articles