హీరో సచిన్ జోషికి ఈడీ ఝలక్… రూ.410 కోట్ల ఆస్తులు సీజ్

ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది.

Read Also: వివాదంలో విరాట్ కోహ్లీ… నిషేధం విధించాలని మాజీల డిమాండ్

కాగా SRA ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ జోషికి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే ఓంకార్ గ్రూప్‌కు చెందిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సచిన్ జోషిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2002లో మౌనమేలనోయి సినిమాతో సచిన్ జోషి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.

Related Articles

Latest Articles