‘పెద్దన్న’తో పోటీపడబోతున్న ‘ఎనిమి’

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ సైతం శనివారం సాయంత్రం విడుదలైంది.

Read Also : ‘పెద్దన్న’ టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్

స్టార్ట్ టు ఎండ్ హాలీవుడ్ యాక్షన్ మూవీని అలపించేలా ‘ఎనిమి’ ట్రైలర్ ఉండటం విశేషం. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ తో పాటు తంబి రామయ్య, కరుణాకరన్, మాళివిక అవినాశ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ నేపథ్య సంగీతం ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ ట్రైలర్ లో శాంపిల్ గా చూపించారు. డి. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి. రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మొత్తం మీద ‘ఎనిమి’ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.

Related Articles

Latest Articles