పుల్వామాలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…

పుల్వామాలో ఈ ఉద‌యం భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.  ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం అయ్యారు.  పుల్వామాలోని జిల్లా ఆసుప‌త్రి స‌మీపంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే ప‌క్కాస‌మాచారంతో ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ క‌లిసి జాయింట్ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి.  ఉగ్ర‌వాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు సైన్యంపై కాల్పులు జ‌రిపారు.  సైన్యం ఎదురుకాల్పులు జ‌రిపగా ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.  ప్ర‌స్తుతం పుల్వామాలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంతో క‌ర్ఫ్యూను విధించారు.  ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు పుల్వామాను జ‌ల్లెడ‌ప‌డుతున్నాయి.  

Read: “రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?

-Advertisement-పుల్వామాలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌...ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం...

Related Articles

Latest Articles