హెల్మెట్స్ పెట్టుకొని పనిచేస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే షాకే!

సాధారణంగా బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమంటేనే కొంతమంది ఏదోలా చూస్తారు. ఇక పోలీసుల భయంతో మరికొంతమంది హెల్మెట్స్ పెట్టుకొంటారు. కానీ, ఈ హాస్పిటల్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఉద్యోగం చేస్తున్నంతసేపు హెల్మెట్ ని ధరిస్తూనే ఉంటారు.. ఆహా ఎంత బాధ్యత అని అనుకోకండి.. ఎందుకంటే వారి -ప్రాణాలను కాపాడుకోవడానికి వారికున్న ఏకైక మార్గం అదొక్కటే.. అదేంటీ.. హెల్మెట్ తో ప్రాణాలు కాపాడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..? మరి ఆ హాస్పిటల్ పరిస్థితి అంత అద్వానంగా ఉంది కాబట్టి.. ఎప్పుడు ఏ పెచ్చు ఉండి తలమీదపడుతుందో తెలియదు కాబట్టి.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని దుర్గావతి ప్రైమరీ హెల్త్ సెంటర్‌ లోని దుస్థితి ఇది.

ఎన్నో ఏళ్లుగా కట్టిన హాస్పిటల్ కావడంతో ఎండకు ఎండి, వానకు తడిసి శిధిలావస్థకు చేరుకొంది. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో ఎవరు చెప్పలేరు. ఇటీవల ఇద్దరు ఉద్యోగుల తలపై పెచ్చులు ఊడిపడి గాయాలపాలయ్యారు. దీంతో ఉద్యోగులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఏ పెచ్చు ఊడినా హెల్మెట్ ఉంటుంది కాబట్టి ప్రాణాపాయం ఉండదు అని వారు భావించారు. ఇకపోతే ఈ శిధిలావస్థ భవనం ప్లేస్ లో కొత్త భవనం నిర్మించనున్నామని, కొద్దిరోజులు ఓపిక పెట్టాల్సిందిగా ఉద్యోగులకు పీహెచ్‌సీ ఇన్‌చార్జ్ తెలిపారు.

Related Articles

Latest Articles