సుప్రీంను ఆశ్రయించిన బదిలీ అయిన ఏపీ ఉద్యోగులు

ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జులై 14న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్‌ ఇవ్వలేదని పిటిషన్‌ వేసిన ఏపీ ఉద్యోగులు.. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ డిసెంబర్‌ 3లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్‌ వేయకపోతే ప్రతివాదులంతా కోర్టుకు రావాల్సి ఉంటుందన్న సుప్రీం చెప్పింది. డిసెంబర్‌ 8న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

ఆగస్టులో ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జరిగింది. దీనిపై ఇప్పటి వరకు జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకోలేదని ఓవైపు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమను తెలంగాణ నుంచి ఏపీ బదిలీ చేయాలని, లేదా సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పోస్టింగ్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉద్యోగులు తెలిపారు.

Related Articles

Latest Articles