యూఎస్ ఓపెన్ : గ్రాండ్ స్లామ్‌ను గెలిచిన ఎమ్మా

యూఎస్ ఓపెన్ ఫైనల్‌ మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ‘ఎమ్మా’ మొదటి నుంచి ప్రత్యర్థి ‘లెలా’పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రెండో సెట్‌ను .. 6-3 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో వరుస సెట్లలో విజయం సాధించిన ఎమ్మా.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ను సాధించింది. గ్రాండ్ స్లామ్ విజయం సాధించి 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ విక్టరీతో ఎమ్మా ర్యాంకింగ్‌లో.. 150 నుంచి 23కి చేరింది. అంటే ఒకేసారి 127 ర్యాంకులు ఎగబాకింది.

అలాగే 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుకున్న బ్రిటన్‌ మహిళగా అరుదైన రికార్డును ఎమ్మా తన ఖాతాలో వేసుకుంది.17 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచింది. ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌లు ఎదుర్కొన్న ఎమ్మా.. ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గింది.

Related Articles

Latest Articles

-Advertisement-